మన్యం న్యూస్ కారేపల్లి,అక్టోబర్ 19:
కారేపల్లి మండలం ఎర్రబోడుకు చెందిన ఉపసర్పంచ్ వజ్జా నరేష్ తండ్రి సీపీఎం సానుభూతిపరుడు వజ్జా చిన్న అనంతరాములు(64) గురువారం మృతి చెందాడు. కొంత కాలంగా కిడ్ని సంబంధిత వ్యాధితో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నాడు.పరిస్ధితి విషమించి గురువారం మృతి చెందాడు.మృతునికి భార్య,ఇద్దరు కుమారులు,ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.చిన్న కుమారుడు నరేష్ ఉప సర్పంచ్ గా ఉన్నారు.మృతుడు చిన్న అనంతరాములు ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు మాజీ ఎంపీటీసీ వజ్జా రామారావుకు స్వయాన సోదరుడు. మృతదేహాన్ని వజ్జా రామారావు,సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కొండెబోయిన నాగేశ్వరారవు,మండల కార్యదర్శి కే.నరేంద్ర,సర్పంచ్ కుర్సం సత్యనారాయణ లు సందర్శించి నివాళ్లు ఆర్పించారు.