మన్యం న్యూస్ దుమ్ముగూడెం అక్టోబర్ 19::
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల సమస్యల కోసం పోరాడే సిపిఎం పార్టీ అభ్యర్థిని గెలిపించాలని సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు ఎలమంచి రవికుమార్ పేర్కొన్నారు. గురువారం దుమ్ముగూడెం గ్రామంలో సిపిఎం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం కామ్రేడ్ షేక్ అహ్మద్ హుస్సేన్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా భద్రాచలం నియోజవర్గ కో కన్వీనర్ కారం పుల్లయ్య, రవికుమార్ పాల్గొని మాట్లాడుతూ.. భద్రాచలం నియోజవర్గంలో 10 సంవత్సరాల కాలంలో టిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసింది ఏం లేదని అభివృద్ధి కొరకు నిరంతరం పోరాడే సిపిఎం పార్టీని గెలిపించాలని కోరారు. నియోజకవర్గం అభివృద్ధికి దూరం పెట్టిన బిఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వంశీకృష్ణ, చంద్రయ్య, మండల కమిటీ సభ్యులు శ్రీనుబాబు, సర్పంచ్ రాజేష్, త్రినాధరావు, గణేష్ రెడ్డి, సతీష్, తదితరులు పాల్గొన్నారు.