బిఆర్ఎస్ లో భారీగా చేరికలు
అభివృద్ధి,సంక్షేమానికి అండగా నిలుస్తున్న ప్రజలు
రాజపేట గ్రామం నుండి 120 కుటుంబాలు బిఆర్ఎస్ లో చేరిక
కండువా కప్పి ఆహ్వానించిన ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు
మన్యం న్యూస్ మణుగూరు:
మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని రాజపేట ఏరియాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 120 కుటుంబాలు అభివృద్ధి,సంక్షేమ పథకాలు ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈసందర్భంగా ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే రేగా కాంతరావు వారిను గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం పార్టీలో చేరిన వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ,బిఆర్ఎస్ మ్యానిఫెస్టో ప్రజల మ్యానిఫెస్టో అని,దేశంలో ఎక్కడ లేని విధంగా సీఎం కేసీఆర్ మేనిఫెస్టో రూపొందించారు అన్నారు.ఇందులో కేసీఆర్ భీమా ప్రతి ఇంటికి బీమా పథకం చారిత్మత్మకమైన పథకం అన్నారు.ఈ పథకం అమలు అయితే రాష్ట్రంలోని 90 లక్షల మంది పేద కుటుంబాలకు దీమాగా నిలుస్తుందని వారు తెలిపారు.ఇప్పటిదాకా రాష్ట్రంలో లక్షలాది మంది రైతులకు రైతు బీమాను ప్రభుత్వం అందజేసింది అని, రైతు మరణిస్తే రైతు బీమా ఐదు లక్షల రూపాయలు వారి కుటుంబాలకు భరోసాగా అందజేయడం జరిగింది అన్నారు.ప్రభుత్వమే ఏటా నాలుగువేల కోట్ల ప్రీమియం చెల్లిస్తున్నద అన్నారు.అయితే కొత్తగా అమలు చేస్తున్న మ్యానిఫెస్టోలో ప్రకటించిన కేసీఆర్ బీమా పేదింటికి బీమానిస్తున్నదని తెలిపారు. శ్రామిక వర్గాలు,ఇతర పనులు చేసుకునే వారందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అన్నారు.ఇక రేషన్ దుకాణాల లో ప్రతి దుకాణానికి సన్న బియ్యం అందించడం గొప్ప ఆలోచన అని ఇప్పటికే రాష్ట్రం లోని 24 వేల పాఠశాలలు, 1008 గురుకులాలలో సన్న బియ్యంతో భోజనం పెడుతున్న ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని కొనియాడారు. పింఛన్లలో తెలంగాణ దేశానికే మార్గదర్శకంగా దివ్యాంగులకు ఇస్తున్న రూ.4016 ను దశలవారీగా రూ.6,016కు పెంచుతామని,ఆసరా పెన్షన్ రూ 2016,సైతం దశలవారీగా రూ.5,016 పెరుగుతుంద అని అన్నారు.రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని,పేదలకు కుటుంబాలకు 400 కే సిలిండర్ అందజేస్తామన్నారు.మళ్ళీ అధికారంలోకి వస్తే ఇప్పుడున్న ప్రతి పథకాన్ని యధావిధిగా కొనసాగిస్తామని విప్ రేగా తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అడపా అప్పారావు వర్కింగ్ ప్రెసిడెంట్ నవీన్,పార్టీ సీనియర్ నాయకులు, రాంబాబు,యాదగిరి గౌడ్, స్థానిక నాయకులు,పార్టీ కార్యకర్తలు,మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.