మన్యం న్యూస్, చండ్రుగొండ, అక్టోబర్ 19 : అశ్వరావుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించిన అభ్యర్థికి ఐక్యతతో పనిచేసి గెలిపిస్తామని గురువారం చండ్రుగొండ లో ఆ పార్టీ కార్యకర్తలు భారీ ప్రదర్శన చేశారు. స్థానిక బస్టాండ్ సెంటర్ నుండి భారీ ప్రదర్శన గా అయ్యన్నపాలెం గ్రామంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీలో వర్గాలకు తావు లేకుండా, అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థిని గెలిపించుకుంటామని, కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించుకొని సమిష్టి నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బానోత్ పార్వతి, వైఎస్ ఎంపిపి నరకుళ్ళ సత్యనారాయణ,సొసైటీ చైర్మన్ చెవుల చందర్రావు, మాజీ ఎంపీపీ గుగులోతు బాబు, మాజీ జెడ్పిటిసి అంకిరెడ్డి కృష్ణారెడ్డి, సంకా కృపాకర్, సారేపల్లి శేఖర్, కేశబోయిన నరసింహారావు,ధారం గోవిందారెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.