మన్యం న్యూస్ దుమ్ముగూడెం అక్టోబర్ 19::
రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని ఐటీసీ సంస్థ ఆర్గనైజర్ సోడి తిరుపతిరావు సూచించారు. గురువారం మండలంలోని భీమారం గ్రామంలో ఐటిసి బంగారు భవిష్యత్తు సంస్థ ఆధ్వర్యంలో రైతులకు వర్మి కంపోస్ట్ బ్యాగులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఐటీసీ సంస్థ వారు పాల్గొని మాట్లాడుతూ.. భీమవరం గ్రామాన్ని సహాసిద్ధమైన విలేజ్ గా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా వృక్ష సంయుక్త వ్యవసాయం చేసే సోషల్ ఫారెస్ట్ రైతులకు సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేయాలని లక్ష్యంతో రైతులకు ఉచితంగా కంపోస్ట్ వర్మి బ్యాగులను పంపిణీ చేయడం జరుగుతుందని ఈ వ్యవసాయం పెంపొందించుకోవడంలో ఐటీసీ సంస్థ సహకారం అందిస్తుందని తెలిపారు. ఐటీసీ సంస్థ అందించే సహకారాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ స్వరాజ్ సంస్థ కోఆర్డినేటర్ ప్రవీణ్ ఆర్గనైజర్ తిరుపతిరావు రైతులు పాల్గొన్నారు.