మన్యం న్యూస్, కరకగూడెం:బీఆర్ఎస్ పార్టీ పినపాక ఎమ్మెల్యే అభ్యర్థి రేగా కాంతారావుని అత్యధిక మెజార్టీ గెలిపించాలని గొల్లగూడెం గ్రామంలో బీ ఆర్ ఎస్ శ్రేణులు శనివారం ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలు,రేగా కాంతారావు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు,కేసిఆర్ ప్రకటించిన నూతన మ్యానిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ,కారు గుర్తుకు ఓటు వేసి పినపాక నియోజకవర్గ బీ ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి రేగా కాంతారావు ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో 28వ బూత్ ఇంచార్జీ గుడ్ల రంజిత్,సుతారి నాగేష్,ఉపసర్పంచు చేను సాంబయ్య,ఇర్ప రామయ్య,ఇర్ప నాగేష్,గ్రామ కమిటీ అధ్యక్షులు కుషేలుడు,వంశీ,వినోద్,రాంబాబు, విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.
