రాబోవు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌దే అధికారం
ఎన్నికల ప్రచారంలో బీ ఆర్ ఎస్ సోషల్ మీడియాదే కీలక పాత్ర
బీ ఆర్ ఎస్ సోషల్ మీడియా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కర్నే మురళి
మన్యం న్యూస్,అశ్వాపురం :రాబోవు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌దే అధికారమని, ఎన్నికల ప్రచారంలో సోషల్ మీడియాదే కీలక పాత్ర ఉంటుందని, ప్రతి బూత్ స్థాయికి చేరేలా ప్రణాళిక సిద్ధం చేయాలని సోషల్ మీడియా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కర్నే మురళి అన్నారు. అశ్వాపురం మండలం సోషల్ మీడియా ప్రత్యేక సమావేశం శనివారం అశ్వాపురంలోని ఓం శక్తి గుడి టెంపుల్ వెనుక ఉన్న ప్రాంగణంలో బీఆర్‌ఎస్ పార్టీ అశ్వాపురం సోషల్ మీడియా మండల అధ్యక్షులు మల్లెబోయిన ప్రశాంత్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అశ్వాపురం మండలంలో ఉన్న 41 బూత్‌లలో బీఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియా బూత్ స్థాయి అధ్యక్షులను ఇద్దరిని నియమించగా, అశ్వాపురం మండల స్థాయిలో సమన్వయకర్తలుగా పేర్ల సందీప్, కాల్వ విజయ్‌రాజును నియమించారు. ముందుగా ఈ ముఫ్పై రోజులు రేగన్న గెలుపుకోసమే సోషల్ మీడియా ప్రచారంలో నేటి నుంచి ఒకపై యుద్ధమే అన్న ప్రతిజ్ఞను సోషల్ మీడియా సభ్యులతో చేయించి సోషల్ మీడియా వారియర్స్‌లో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం కర్నే మురళి మాట్లాడుతూ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సూచనల మేరకు అశ్వాపురంలో సోషల్ మీడియా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాబోవు ఎన్నికల్లో సోషల్ మీడియాదే కీలక పాత్ర అని, ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా పనిచేయాలన్నారు. పినపాకలో రేగన్న గెలుపే లక్ష్యంగా శ్రమించాలన్నారు. పినపాక నియోజకవర్గంలో రేగా కాంతారావు చేసిన అభివృధ్ది పనులపై ప్రతి గడపకూ చేరేలా విస్తృత ప్రచారం చేయాలన్నారు. పినపాక నియోజకవర్గాన్ని అభివృద్ది చేయాలంటే రేగన్నతో సాధ్యమని, అందుకు కంకణబద్ధులై శ్రమించాలన్నారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం పినపాక నియోజకవర్గ అధ్యక్షులు మట్టపల్లి సాగర్ యాదవ్, యువజన విభాగం పినపాక నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మంగళగిరి రామకృష్ణ, సోషల్ మీడియా మండల ప్రధాన కార్యదర్శి గజ్జి లోహిత్ యాదవ్, ఎస్సీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి వల్లెపోగు రాము, మోదుగు వంశీ, అవినాష్, గౌతమ్, శశి, జూపల్లి కిరణ్, శేఖర్, మహేష్, వెంకటేశ్, సందీప్, పవన్, శివ, రాంప్రసాద్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.