UPDATES  

 రేగా గెలుపుకై విస్తృత ప్రచారం

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పినపాక నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ భద్రాద్రి కొత్తగూడెం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు గెలుపుకై భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు పినపాక ఏరియాలో ఆదివారం ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన రేగా కాంతారావును చూసి కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రచారం చేశారు. రేగా గెలుపు అభివృద్ధికి మలుపు అని పిలుపునిస్తూ ఎన్నికల ప్రచారం చేయడంతో ఆకర్షణగా కనిపించింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ రాష్ట్ర కార్యదర్శి మోరే భాస్కర్ రావు, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు సంకు బాపన అనుదీప్, బీఆర్ఎస్ నాయకులు చందు నాయక్, సంగేపు రాంప్రసాద్, గుంపుల మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ నాయకులు రేగా కాంతారావును స్వయంగా కలిసి ఎన్నికల కార్యచరణపై చర్చించారు. ఎన్నికలలో ఎలా ముందుకు పోవాలి ఓటర్లను ఎలా ఆకట్టుకోవాలో అనే అంశాలపై మాట్లాడారు. పినపాక అడ్డాలో రేగా గెలుపుకై తామంతా విస్తృతంగా ప్రచారం చేసి ఆయనను అసెంబ్లీ గేటును దాటిస్తామని బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !