మన్యం న్యూస్, అశ్వారావుపేట, అక్టోబర్, 29: మండల పరిధిలోని, జమ్మిగూడెం గ్రామపంచాయతీకి చెందిన టిడిపి పార్టీ మాజీ సర్పంచ్ మిద్దిన రాములు, నాయకులు మిద్దిన లక్ష్మణరావు, రాజు తదితరులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వినాయకపురం గ్రామంలో ఆదివారం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే మెచ్చా సమక్షంలో బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వారికి ఎంపీ నామా నాగేశ్వరరావు గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మిద్దిన రాములు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కెసిఆర్ అందించిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే మరింత అభివృద్ధి సాధ్యమని భావించి పార్టీలో చేరనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకలు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
