UPDATES  

 తెల్లం గెలుపులో యువత కీలకం కావాలి.. ఎమ్మెల్సీ తాతా మధు..

  • తెల్లం గెలుపులో యువత కీలకం కావాలి.. ఎమ్మెల్సీ తాతా మధు
  • నన్ను గెలిపించండి నియోజకవర్గం అభివృద్ధి చేసి మీ మనసు గెలుచుకుంటాను.. తెల్లం వెంకట్రావు..

 

మన్యం న్యూస్ దుమ్ముగూడెం ::

భద్రాచలం నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు విజయంలో యువత కీలకం కావాలని ఎమ్మెల్సీ తాత మధుసూదన్  పిలుపునిచ్చారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో డాక్టర్ తెల్లం వెంకట్రావుకి మద్దతు తెలిపేందుకు దుమ్ముగూడెం మండల యూత్ సమావేశంలో ఆదివారం సీతానగరం గ్రామంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ భద్రాచలం నియోజకవర్గ ఇంచార్జి  తాతా మధు సుధన్ , ఎమ్మెల్యే అభ్యర్ధి డాక్టర్ తెల్లం వెంకట్రావు లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజయంలో మేము బాగా స్వాములం అవుతామని పార్టీలకు అతీతంగా మండల యువత ముందుకు రావడం విజయానికి తొలి సంకేతమని ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడంతోపాటు యువతకు క్రీడాకారులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ మండలాలలో కోట్ల రూపాయలు వెచ్చించి క్రీడా మైదానాలు పరికరాలు క్రీడా సామగ్రి అందించడం జరుగుతుందని తెలిపారు. భద్రాచలం నియోజకవర్గం అభివృద్ధి వైపు పయనించాలంటే యువత సామాజిక మాధ్యమాలలో వాట్సాప్ లలో కారు గుర్తుకు ఓటు వేసి డాక్టర్ తెల్లం వెంకట్రావుని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తమ స్నేహితులకు బంధువులకు విస్తృతంగా సందేశాలు పంపాలని విజ్ఞప్తి చేశారు. లోకల్ వ్యక్తి అయినా వెంకట్రావును గెలిపిస్తే మన సమస్యలన్నీ తీరుస్తారని, మాయమాటలు చెప్పే కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు నమ్మవద్దని సూచించారు. అనంతరం భద్రాచలం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకటరావు మాట్లాడుతూ.. ఒక్క అవకాశం ఇచ్చి నన్ను గెలిపించండి నియోజవర్గ అభివృద్ధికి చేసి మీ మనసులు గెలుచుకుంటానని తెల్లం వెంకట్రావు అన్నారు. నియోజవర్గానికి దూరంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేని గెలిపించుకునే దానికంటే ఎప్పుడు మీకు అందుబాటులో ఉండే నాకు ఈసారి అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నా విజయంలో యువతదే కీలకపాత్ర అని, దుమ్ముగూడెం మండల యువకులందరూ నాకు సపోర్ట్ చేయడం వల్ల ఈసారి భద్రాది గడ్డలో బీఆర్ఎస్ జెండా ఎగడం ఖాయమని అన్నారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాల నుండి 200 మంది యువకులు ఎమ్మెల్సీ తాత మధు ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం వెంకటరావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ నియోజవర్గ ఇంచార్జ్ మానే రామకృష్ణ, ఎంపీపీ రేసు లక్ష్మి, జడ్పిటిసి తెల్లం సీతమ్మ, మండల కార్యదర్శి రాముడు, ఉపాధ్యక్షులు తునికి కామేశ్వరరావు, భద్రాచలం నియోజవర్గ యూత్ అధ్యక్షులు మల్లెల లోకేష్, ఎంపిటిసిలు తిరుపతిరావు, సర్పంచులు మట్ట శివాజీ, నాగేంద్రబాబు, చిన్నారావ్, బాలకృష్ణ, యూత్ అధ్యక్షులు వెంకటేష్, గంగరాజు, లంక శివ, సీనియర్ నాయకులు తాళ్లపల్లి రమేష్ గౌడ్, సీతారామరావు, వెంకటరమణ, జై సింహ, ఆదినారాయణ, తోట రమేష్, ఉబ్బా వేణు, మద్ది శ్రీను, కల్లూరి శంకర్, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !