UPDATES  

 పేదల నేస్తం కాంగ్రెస్ అభయ హస్తం–:కాంగ్రెస్ నాయకులు నాసిరెడ్డి సాంబశివరెడ్డి

మన్యం న్యూస్, మంగపేట.

పేదల నేస్తం కాంగ్రెస్ పార్టీ అభయ హస్తం అని కాంగ్రెస్ ముఖ్య నాయకులు నాసిరెడ్డి సాంబశివరెడ్డి అన్నారు ఆదివారం మండలంలోని అకినేపల్లి మల్లారం గ్రామంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ మోయుముద్దీన్ ప్రచార కమిటీ ఇన్చార్జి లక్కీ వెంకన్న ఆధ్వర్యంలో గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించి కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాల కార్డులను పంపిణీ చేస్తూ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ వెంటనే అమలు చేస్తామని పేదింటి మహిళలందరికీ రూ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్లు అందిస్తామని మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు నెలకు రు రెండు వేల ఐదు వందలకు అందజేయడంతో పాటు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించినట్లు తెలిపారు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించడంతోపాటు గృహజ్యోతి పథకం ద్వారా రెండు వందల యూనిట్ల లోపు అర్హులైన వారందరికీ ఉచితంగా గృహ విద్యుత్ అందిస్తామని తెలిపారు రైతు భరోసా పథకం ద్వారా సంవత్సరానికి ఎకరానికి పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం చేయడంతో పాటు వ్యవసాయ కూలీలకు సైతం రూ పన్నెండు వేల రూపాయలు అందజేస్తామని తెలిపారు వీటితోపాటు వరి పంటకు క్వింటాలకు రూ ఐదు వందల రూపాయలు అదనపు బోనస్ ధర చెల్లించనున్నట్లు తెలిపారు చేయూత పథకం కింద వృద్ధులు వికలాంగులు ఒంటరి మహిళలు పెన్షన్ దారులందరికి ఏకకాలంలో రూ నాలుగు వేలు పింఛన్ ని అందజేస్తామని ఆరోగ్య శ్రీ పథకం ద్వారా పది లక్షల రూపాయల వరకు అన్ని రకాల జబ్బులకు ఉచితంగా వైద్య సౌకర్యాన్ని కాంగ్రెస్ పార్టీ అందజేస్తుందని తెలిపారు ఆడబిడ్డల పెళ్లి కోసం రూ లక్ష ఆర్థిక సహాయంతో పాటు తులం బంగారాన్ని అందజేయనున్నట్లు వారు తెలిపారు. సీతక్క గెలుపు కోసం ప్రతి కార్యకర్త కదలి రావాలని ప్రజలందరూ ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాసిరెడ్డి నాగిరెడ్డి కటుకూరి శేషయ్య ఎలగొండ పెద లక్ష్మయ్య నాసిరెడ్డి లక్ష్మారెడ్డి వెంకట్ రెడ్డి మాధవరెడ్డి తొండపు పెద నర్సిరెడ్డి కార్యకర్తలు చెట్టు పెళ్లి రాజు చెట్టు పెళ్లి నరసింహారావు చౌదరి పాపయ్య సాంబశివరావు రవి దూలగొండ నారాయణ ఇనుముల నరసింహారావు కొంబత్తిని సాంబశివరావు డబ్బుల నాగయ్య ఎలగొండ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !