- ఆళ్లపల్లి మండలంలో జ్వరాల విజృంభన
- ఇప్పటికే డెంగ్యూ జ్వరంతో పలువురు మృతి
మన్యంన్యూస్ గుండాల:ఆళ్లపల్లి మండలంలో జ్వరాల మరణ మృదంగం మోగుతుంది ఇప్పటికే డెంగ్యూ జ్వరంతో పలువురు చిన్నారులు పెద్దలు సైతం మృతి ఒడిలోకి చేరిన స్థానిక ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది కి మాత్రం నిమ్మకు నీరు ఎత్తినట్టు కూడా లేదు. గత రెండు నెలల నుండి మరణాలు సంభవిస్తున్న స్థానిక హెల్త్ సూపర్వైజర్, స్థానిక వైద్యులు సరైన చర్యలు తీసుకోకపోవడంతో చెప్పండి జ్వరాలతో మరణాలు పెరిగిపోతున్నాయి. ఆళ్లపల్లి మండలం మైలారం గ్రామానికి చెందిన జోగా ప్రేమ్ కుమార్ డెంగు జ్వరంతో హైదరాబాదులో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం తుది శ్వాస విడిచాడు స్థానిక వైద్య సిబ్బంది సరైన వైద్యం స్థానిక వైద్యశాలలో లేకపోవడం గ్రామాల్లో హెల్త్ క్యాంపులు నిర్వహించకపోవడంతో మరణాల సంఖ్య భారీగా పెరుగుతున్నట్లు మండల ప్రజలు పేర్కొంటున్నారు. స్థానిక హెల్త్ సూపర్వైజర్ ఏమాత్రం గ్రామాలలో వైద్య సదుపాయాలు చేయకపోవడం వలన జ్వరాలతో మరణాలు పెద్ద మొత్తంలో జరుగుతున్నాయని గిరిజన గ్రామ ప్రజలు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నత అధికారులు డి ఎం ఎన్ హెచ్ ఓ ఆళ్లపల్లి వైద్యశాలపై కాసింత నగర్ పెట్టి వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో జ్వరాలతో మరింత ప్రజలు మరణించే ప్రమాదం ఉందని ప్రజలు ఆవేదన వెలుబుచ్చారు.