మన్యంన్యూస్ ఇల్లందురూరల్:- ఎన్నికల ప్రచార హోరు లో ఎమ్మెల్యే హరిప్రియ జోరుగా దూసుకుపోతున్నారు. ఆదివారం, మండలంలోని మర్రిగుడెం, పోలారం పంచాయితీల్లో ప్రచారం జోరుగా సాగింది. గ్రామాల్లోని ప్రజలు ఎక్కడికక్కడ సాదర స్వాగతం పలుకుతున్నారు. బ్రహ్మ రదం పడుతున్నారు. ఈ ప్రచార సందర్భంలోనే శీతలతండా లో 20 కుటుంబాలు బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరిన వారిని ఎమ్మెల్యే హరిప్రియ సాదరంగా ఆహ్వానం పలికారు, ధన్యవాదాలు తెలిపారు. హరిప్రియ మాట్లాడుతూ బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం లో బడుగు బలహీనర్గాల ప్రజలంతా బాగం అయ్యి కొత్త అధ్యాయానికి తెరతియ్యాలన్నారు. సంక్షేమ పథకాలు ఇలాగే కొనసాగాలంటే బీఆర్ఎస్ గెలుపు చారిత్రక అవసరం అని అన్నారు. ఈ ప్రచారంలో దిండిగాల రాజేందర్, డీసీసీబీ డైరెక్టర్ జనగం కోటేశ్వరరావు, ఖమ్మంపాటీ రేణుక, మహేందర్, లస్కర్ తదితరులు పాల్గొన్నారు.
