- కొమరం భీమ్ ఆశయాలు స్ఫూర్తిదాయకం
మన్యం న్యూస్ నూగూర్
వెంకటాపురం.
మండల కేంద్రంలో కొమరం భీం విగ్రహం వద్ద ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు అట్టం రవితేజ, అధ్యక్షతన కొమరం భీమ్ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బజిల్లా ఉపాధ్యక్షులు చింత సోమరాజు, డివిజన్ ప్రధాన కార్యదర్శి, సిద్ధబోయిన సర్వేశ్వరరావు హాజరయ్యారు వారు మాట్లాడుతూ నిజాం పాలకుల నిరంకుశత్వానికి.. అధికారుల దమననీతికి ఎదురు నిలిచి పోరాడిన యోధుడు, కొమరం భీమ్ అని కొని ఆడారు జల్, జంగిల్, జమీన్ అని నినదించి ఆదివాసీల హక్కుల కోసం ప్రాణాలను సైతం లెక్కచేయక ఉద్యమించి గిరిజనుల అభ్యున్నతికి తన ప్రాణాలను తృణప్రాయంగా వదిలేసిన అమరుడు గోండు బెబ్బులి . కొమరం భీమ్ అని స్మరించుకున్నారు.., ఈ కార్యక్రమంలో ఆదివాసీ నవనిర్మాణ సేన వర్కింగ్ ప్రెసిడెంట్ వాసు నాగరాజు, తుడుందెబ్బ జిల్లా నాయకులు కుచ్చింటి చిరంజీవి, తుడుం దెబ్బ జిల్లా కార్యదర్శి మడకం చిట్టిబాబు,డివిజన్ నాయకులు, కనితి ప్రశాంత్, పూణేమ్ అర్జున్, తుడుం దెబ్బ మండల నాయకులు, బొగ్గుల విష్ణుమూర్తి, సున్నం రాజు, పీర్ల మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు.