మన్యం న్యూస్, అశ్వారావుపేట, అక్టోబర్, 29: దమ్మపేట మండలం, గాంధీనగరం గ్రామంలో అశ్వరావుపేట నియోజకవర్గం ఆదివాసి నాయకపోడు సేవా సంఘం నియోజకవర్గస్థాయి సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో అశ్వరావుపేట నియోజకవర్గం ఆదివాసి నాయకపోడు సంఘం సభ్యులు, సర్పంచులు, వివిధ పార్టీలో ఉన్న నాయకపోడు కమ్యూనిటీ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చర్చలు సమావేశాలు అనంతరం 2023 శాసనసభ ఎన్నికలలో నాయకపొడ్ కమ్యూనిటీకి చెందిన అభ్యర్థిని ఎమ్మెల్యే బరిలోకి దింపాలని నిర్ణయించినట్లు వాళ్ళు తెలిపారు. అశ్వరావుపేట నియోజకవర్గం లో వారి కమ్యూనిటీ జనాభా ఎక్కువగా శాతం ఉన్నప్పటికీ వివిధ రాజకీయ పార్టీలు కేవలం ఓటు బ్యాంకింగ్ మాత్రమే ఉపయోగించుకుంటున్నట్టు ఆవేదన వ్యక్తం చేస్తూ ఈసారి బరిలో నారంవారి గూడెం సర్పంచ్ మనుగొండ వెంకట ముత్యం నీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెడుతున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి మనకొండ వెంకట ముత్యం మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలకు చిట్టి తల్లి సేవా సమితి అంబులెన్స్ ద్వారా సేవలందిస్తున్నట్లు, ఈ సేవలను మరింత రెట్టింపు చేస్తూ ప్రతి పేద, బలహీన అన్ని వర్గాలకు సేవలు అందించడానికి కృషి చేస్తానని, కమ్యూనిటీ తరఫున అభ్యర్థిగా పెద్దలందరి నిర్ణయానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆయన తెలిపారు. హాజరైన సంఘ పెద్దలు మాట్లాడుతూ అశ్వారావుపేట నియోజక వర్గంలోని నాయకపోడ్లుతో పాటు ఓసి, బిసి, మైనార్టీలంతా స్వతంత్ర అభ్యర్థి మనుగొండ వెంకట ముత్యానికి ఓటు వేసి గెలిపించాలని వారు కొరారు. ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట నియోజకవర్గం ఆదివాసి నాయకపోడు సంఘ పెద్దలు కుల బంధువులు తదితరులు పాల్గొన్నారు.
