- ఎన్నికల ప్రవర్తన నియమావళి ని తూచ తప్పకుండా పాటించాలి….
- చండ్రుగొండ ప్లాగా మార్చ్ లో కొత్తగూడెం డిఎస్సీ అబ్దుల్ రహమాన్….
మన్యం న్యూస్,చండ్రుగొండ, అక్టోబర్ 29: ఎన్నికల ప్రవర్తన నియమావళిని తప్పకుండా పాటించాలని, రానున్న శాసనసభ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటుహక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని కొత్తగూడెం డిఎస్పీ అబ్దుల్హమాన్ పిలుపునిచ్చారు. ఆదివారం మండల కేంద్రమైనా చండ్రుగొండలో పోలీస్ శాఖ ఆద్వర్యంలో ప్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ… స్వేశ్చయుత పోలింగ్ కోసం ప్రతి యొక్కరు సహకరించాలన్నారు. ఎన్నికల్లో క్షణిక ఆవేశాలకు పోయి పోలీస్ కేసుల్లో ఇరుక్కోవద్దన్నారు. ఎన్నికల సమయానికి ప్రశాంత వాతావరణం కల్పించేందుకే పోలీస్ శాఖ లాంగ్ మార్చ్ వంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. గ్రామాల్లో రాజకీయపార్టీలు, నాయకులు సమావేశాలు, ప్రచారం కోసం కచ్చితంగా అనుమతులు తీసుకోవాలన్నారు. చెప్పుడు మాటలు విని కార్యకర్తలు, నాయకులు గొడవలకు పోవద్దన్నారు. చట్టానికి అన్ని రాజకీయపార్టీలు, నాయకులు సమానమన్నారు. 18 ఏండ్లు నిండిన వారు ఇప్పటికైనా ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎన్నికల కమీషన్ ప్రవర్తన నియమావళిని ప్రతి యొక్కరు తూచ తప్పకుండా పాటించాలన్నారు.ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట నియోజకవర్గ పోలీస్ నోడల్ అధికారి వెంకటేశ్, జూలూరుపాడి సిఐ ఎం శ్రీనివాస్, ఎస్సై మాచినేని రవి, అన్నపురెడ్డిపల్లి ఎస్సై షాహీనా, అశ్వరావుపేట డివిజన్ పోలీస్ అధికారులు, సీఆర్పీఎఫ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.