- బిఆర్ఎస్ గెలుపునకు సమిష్టిగా కృషి చేయాలి
- మొరంపల్లి బంజర గ్రామంలో కాంగ్రెస్ పార్టీ చెందిన సుమారు 50 కుటుంబాలు చేరిక
మన్యం న్యూస్ బూర్గంపాడు: మండల పరిధి మొరంపల్లి బంజర గ్రామంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ,పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు సమక్షంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ చెందిన సుమారు 50 కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈసందర్భంగా ఆయన వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు అనంతరం పార్టీలో చేరిన వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గారి సారద్యంలో బిఆర్ఎస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు అనేక పథకాలు ప్రవేశపెట్టింది అన్నారు, ప్రస్తుతం రైతులకు ఎకరానికి 10000 ఇస్తుండగా వాటిని 16 వేలకు పెంచినట్లు తెలిపారు , సిలిండర్ 400 కి ఇస్తామని సీఎం కేసీఆర్ గారు ప్రకటించినట్లు తెలిపారు, సౌభాగ్య లక్ష్మీ పథకం కింద ప్రతి పేద మహిళలకు 3000 దివ్యాంగులు 6 వేలు చెల్లిస్తామన్నారు పేదలకు తెల్ల రేషన్ కార్డు ద్వారా దొడ్డు బియ్యానికి బదులు సన్న బియ్యం అందిస్తామని తెలిపారు ప్రతి కుటుంబానికి 5 లక్షల బీమా పథకం కల్పిస్తున్నట్లు తెలిపారు,దేశంలోనే ఎక్కడలేని విధంగా రైతులకు రైతుబంధు 24 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తున్న రాష్ట్రాలు లేవన్నారు ఒక తెలంగాణలోనే సీఎం కేసీఆర్ పథకాల అమలు చేస్తున్నారని అన్నారు.