- తెల్లంతోనే మా పయనం….. వివిధ పార్టీల కార్యకర్తలు
- తెల్లం కు పూల వర్షంతో మహిళలు బ్రహ్మరథం
- బొళ్ళ వినోద్ అధ్యక్షతన బిఆర్ఎస్ పార్టీ లో 50 కుటుంబాలు చేరిక
మన్యం న్యూస్ చర్ల;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం అంబేద్కర్ నగర్ వీధిలోని వివిధ పార్టీలకు చెందిన 50 కుటుంబాలు యూత్ నాయకులు బొళ్ళ వినోద్ అధ్యక్షతన తెల్లం వెంకటరావు సమక్షంలో పార్టీ కండువు కప్పుకొని చేరడం జరిగింది. పార్టీలో చేరిన వివిధ పార్టీలకు చెందిన పలువురు మహిళలు, కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీ విధి విధానాలు సంక్షేమ పథకాలు ఆకర్షితులై గులాబీ కండువా కప్పుకున్నామని అదేవిధంగా సుపరిచితమైన వ్యక్తి మన లోకల్ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు అని తానను గెలిపిస్తే మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని పలువురు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. తర్వాత డాక్టర్ తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ మన ప్రాంతం అభివృద్ధి సంక్షేమం జరగాలంటే కారు గుర్తుకి తమ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని వ్యాఖ్యానించారు. మన నియోజకవర్గంలో అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారు కానీ అభివృద్ధి మాత్రం శూన్యం కాబట్టి ఈసారి గులాబీ పార్టీ అభ్యర్థి అయిన నన్ను గెలిపించండి సంక్షేమ ఫలాలతో పాటు ప్రతి వీధి, వాడ అభివృద్ధి చేసి చూపిస్తా అని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు మానే రామకృష్ణ, రమేష్ గౌడ్, అధ్యక్షులు సోయ రాజారావు, కార్యదర్శి పోలిన లంక రాజు, సర్పంచ్ కాపుల కృష్ణా, ఎంపీపీ కోదండ రామయ్య, యూత్ అధ్యక్షులు కాకి అనిల్, మాజీ ఎంపీటీసీ ఆలం ఈశ్వర్, సోషల్ మీడియా పంజా రాజు,మండల నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.