మన్యం న్యూస్ మణుగూరు:
మణుగూరు మండలం లోని తోగ్గూడెం సమ్మక్క సారక్క ఆలయం వద్ద బిఆర్ఎస్ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ధారావత్ రామ,సుధాకర్ దంపతుల నూతనంగా కొనుగోలు చేసిన వాహనాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు వారి చేతుల మీదుగా ప్రారంభించారు. ఆనంతరం ధారావత్ రామ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు,పట్టణ అధ్యక్షులు అడపా అప్పారావు, నాయకులు రమేష్,లక్ష్మయ్య, యువజన అధ్యక్షులు హర్ష నాయుడు,యూత్ నాయకులు మహిళా కార్యకర్తలు,సోషల్ మీడియా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.