మన్యం న్యూస్ మణుగూరు:
మణుగూరు మండలం పీవీ కాలనీ నందుగల సింగరేణి కమ్యూనిటీ హాల్ నందు ప్రముఖ కాంట్రాక్టర్ వాసు బాబు కుమార్తె సాయి కృష్ణ వెడ్స్ సాయి భావన నిశ్చితార్థ వేడుకలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పోశం నరసింహారావు,పిఎసిఎస్ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వట్టం రాంబాబు, కీసర శ్రీనివాస్ రెడ్డి,కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.