మన్యం న్యూస్ మణుగూరు:
మణుగూరు మండలం లోని కూనవరం గ్రామ పంచాయతీ లోని బాంబే కాలనీలో జడ్పీటిసి పోశం. నరసింహారావు,ఎమ్మెల్యే రేగా కాంతరావు పిఏ చందా. హరికృష్ణ ఆధ్వర్యంలో బూత్ ఇన్చార్జిల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా జెడ్పిటిసి మాట్లాడుతూ,బూత్ ఇన్చార్జులు అందరూ గ్రామాలలో విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు.ఓటర్లకు ప్రభుత్వ పథకాలను,మేనిఫెస్టో ను వివరిస్తూ అవగాహన కల్పించాలన్నారు.ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు గెలుపు కోసం ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలన్నారు.బి ఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు. మెజారిటీనే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బూత్ ఇన్చార్జులు గుడిపూడి కోటేశ్వరరావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సకిని బాబురావు, కలగూర శంకర్,కీసర శ్రీనివాస్ రెడ్డి,బూత్ ఇన్చార్జులు తదితరులు పాల్గొన్నారు.