UPDATES  

 రేగా లెజెండ్..

రేగా లెజెండ్

  • పినపాక అందాలు కాంతారావు సొంతం
  •  300 కోట్లకు పైగా నిధులతో ప్రజా సంక్షేమం
  •  సీఎం కేసీఆర్ ఆశీస్సులతో నిధుల వరద
  •  సెంట్రల్ లైటింగ్ తో ఊరంతాట వెలుగులు
  •  జరిగిన అభివృద్ధిని చూసి మళ్లీ రేగాకే పట్టం
  •  ప్రచారంలో ముందంజ ప్రజలు బ్రహ్మరథం

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో: ఒక నాయకుడిగా కాకుండా సేవకుడుగానే ఉంటూ సమస్యలను పరిష్కరిస్తూ ప్రజాభిమానాన్ని బీఆర్ఎస్ అభ్యర్థి పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పేద గిరిజనుల కోసం పుట్టిన ఆదివాసి ముద్దుబిడ్డ రేగా కాంతారావు పొందుతున్నారు. అందరివాడిగా ఉంటూ ప్రతి మనిషిని ఆప్యాయంగా పలకరిస్తూ గత కొద్ది రోజులుగా తన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 30వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే రేగా స్వయంగా ప్రతి ఇంటి గడపను తడుతూ తన గెలుపుకై ప్రచారం చేస్తూ బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఉన్న పథకాల గురించి క్లుప్తంగా వివరిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. రేగా ప్రచారాన్ని చూస్తున్న ప్రజలంతా ఆయనకు అండగా నిలబడడమే కాకుండా “రేగా లెజెండ్” అంటూ కొనియాడుతుండడం విశేషం. నవంబర్ 30వ తేదీన దుమ్ము రేపుతామంటూ రేగాకు అభిమానులు మద్దతు తెలుపుతున్నారు. సుమారు 300 కోట్లకు పైగా నిధులతో పినపాక పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసిన రేగా కాంతారావుకే జై కొడతామని బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు పేర్కొంటున్నారు. రేగాకు తోడుగా ప్రతి ఒక్కరు అడుగులో అడుగు వేస్తూ ఇంటి తలుపులను తడుతూ బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఉన్న కేసీఆర్ ధీమా ప్రతి ఇంటికి ధీమా, దివ్యాంగులకు రూ.6016 పెంపు, సౌభాగ్య లక్ష్మి పథకం కింద పేద మహిళలకు ప్రతి నెల 3 వేల రూపాయలు, ప్రతి పేద కుటుంబానికి రూ.400కే గ్యాస్ సిలిండర్, పేదలకు ఇండ్ల స్థలాలు, అనాధ పిల్లల కోసం ప్రత్యేక పాలసీ, అసైన్డ్ భూములపై ఆంక్షలు ఎత్తివేతకు చర్యలు, ఆసరా పెన్షన్లు రూ.5016 పెంపు, రైతుబంధు ద్వారా ఎకరానికి 16 వేల రూపాయలు, ప్రతి తెల్ల రేషన్ కార్డుపై సన్న బియ్యం, ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితి 15 లక్షలు, మైనార్టీలకు మరింత సంక్షేమం, అగ్రవర్ణ పేదలకు గురుకులాలు, మహిళా సమాఖ్యలకు సంత భవనాలు వంటి నిర్మాణాలు జరుగుతాయని సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లకు వివరించడం జరుగుతుంది. ఇప్పటివరకు జరిగిన పినపాక అభివృద్ధి వెలుగులు రేగా కాంతారావు సొంతమని పలువురు హర్షిస్తున్నారు. రేగాను మళ్లీ గెలిపిస్తాం అభివృద్ధిని కొనసాగించుకుంటామని పలువురు ఓటర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !