UPDATES  

 ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులకు ప్రత్యేక బ్యాంకు ఖాతా ఉండాలి –:జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక అల..

 

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:

ఎన్నికల్లో పోటీ చేయు అభ్యర్థులు ప్రత్యేక బ్యాంకు ఖాతా నుండి లావాదేవీలు నిర్వహించాల్సి ఉన్నందున

బ్యాంకర్లు జాప్యం చేయక సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. సోమవారం

ఐడిఓసి కార్యాలయపు మినీ సమావేశపు హాలులో ప్రత్యేక బ్యాంకు ఖాతాలు ప్రారంభించుట, నగదు లావాదేవీలు

నిర్వహణ తదితర అంశాలపై ఆదాయపు పన్ను, బ్యాంకు కంట్రోలింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ

సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేయు అభ్యర్థులు ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా ప్రారంభించాల్సి

ఉన్నందున బ్యాంకర్లు పోటీ చేయు అభ్యర్థులకు సహకరించాలని చెప్పారు. నవంబర్ 3వ తేదీ నుండి నామినేషన్లు

ప్రక్రియ ప్రారంభం అవుతున్నందున పోటీ చేయు అభ్యర్థులు బ్యాంకు ఖాతాలు ప్రారంభించాల్సి ఉంటుందని చెప్పారు.

అభ్యర్ధులు ప్రారంభించిన ప్రత్యేక బ్యాంకు ఖాతా నుండి మాత్రమే లావాదేవీలు చేయాల్సి ఉంటుందని చెప్పారు.

బ్యాంకుల్లో తక్షణ సేవలకు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సహాయతను అందచేందుకు అన్ని బ్యాంకుల్లో

ప్రేత్యక సేవలు అందించాలని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేయు అభ్యర్థులకు టైం చాలా ముఖ్యం కాబట్టి ఎన్నికల

సంఘ నియమ,

సంఘం ప్రత్యేక చర్యలతో సేవలు అందించాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు. ఎన్నిక

నిబంధనల మేరకు బ్యాంకు లావాదేవీలపై పటిష్ట నిఘా ఉంటుందని చెప్పారు. ఏటియంలకు కానీ, ఇతర బ్రాంచిలకు

కానీ నగదు రవాణా చేసేందుకు సి విజిల్ యాప్ ద్వారా అనుమతులు తీసుకోవాలని చెప్పారు. ఒక బ్యాంకు ఖాతా

నుండి పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు నిర్వహణ పర్యవేక్షణ చేయాలని చెప్పారు. 10 లక్షలకు మించి జరిగే

లావాదేవీలపై ఆదాయపుపన్ను శాఖ అధికారులు ప్రత్యేక నిఘా ఉంటుందని చెప్పారు. లక్ష కంటే ఎక్కువ జమ,

చేసినా లేదా నగదు బదిలీ చేసే ఖాతాలపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. అభ్యర్థులు నామినేషన్లో

పేర్కొన్న కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలపై కూడా ప్రత్యేక నిఘా ఉంచాలని చెప్పారు. నామినేషన్ ప్రారంభం

నుండి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు అభ్యర్థులు చేయు ప్రతి పైసాకు లెక్కలు పక్కాగా నమోదులు జరుగుతాయని

చెప్పారు. అభ్యర్థులు చేయు ప్రతి పైసా ఖర్చు ప్రత్యేక బ్యాంకు ఖాతా నుండి మాత్రమే జరగాలని చెప్పారు. బ్యాంకు

ఖాతా ప్రారంభించుటపై నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు కార్యాలయాల్లో తగు సలహాలు, సూచనలు, సహాయత

కొరకు బ్యాంకర్లు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని చెప్పారు. నగదు లావాదేవీలపై బ్యాంకర్లు ప్రతి రోజు నివేదికలు

అందచేయాలని చెప్పారు. ఆర్టిజిఎస్ ద్వారా ఒక బ్యాంకు ఖాతా నుండి బల్క్ గా నగదు బదిలీ జరిగే ఖాతాలపై

ప్రత్యేక నిఘా ఉంచాలని చెప్పారు.

ఈ సమావేవంలో వ్యయ పరిశీలన నోడల్ అధికారులు యన్ వెంకటేశ్వర్లు, వెంకటేశ్వరరెడ్డి, ఎన్డీయం

రాంరెడ్డి, ఆదాయపుపన్ను శాఖ నోడల్ అధికారి సింధు, అన్ని బ్యాంకుల కంట్రోలింగ్ అధికారులు తదితరులు

పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !