మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
సింగరేణి సంస్థ ఛైర్మన్ అండ్ డైరక్టర్ ఎన్.శ్రీధర్ ఆదేశాల మేరకు ఈ నెల 30 నుండి నవంబర్ 05 వరకు సింగరేణి కంపెనీ వ్యాప్తంగా అన్ని ఏరియాల గనులు డిపార్ట్మెంట్లలో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలను నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా సింగరేణి ప్రధాన కార్యాలయములో జరిగిన విజిలెన్స్ అవగాహన వారోత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సంస్థ డైరెక్టర్(ఈ అండ్ ఎం)డి.సత్యనారాయణ రావు, విశిష్ట అతిధిగా డైరక్టర్(పి అండ్ పి) జి.వేంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ డి.సత్యనారాయణరావు మాట్లాడుతూ అవినీతిని తిరస్కరించండి దేశం పట్ల నిబద్ధత కలిగి ఉండండి అనే నివాదం ఈ సంవత్సరం విజిలెన్స్ అవగాహన వారోత్సవాల ముఖ్యోద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమములో జిఎం (సిపిపి) జక్కం రమేష్, జిఎం పర్సనల్ వెల్ఫేర్ అండ్ ఆర్‌సి
కె.బసవయ్య, జిఎం విజిలెన్స్ (ఈ అండ్ ఎం) కే.ప్రసాద రావు, జిఎం(ఐటి) జి.రామ్ కుమార్ రావు, కార్పోరేట్ లోని వివిధ విభాగాల జనరల్ మేనేజర్లు, విజిలెన్స్ ఆఫీసర్లు, అధికారులు, ఉద్యోగులు పాల్గొని ప్రతిజ్ఞ చేశారు.