మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
ఖమ్మం జిల్లా పరిధిలోని రఘునాధపాలెం నుండి కోయచలక గ్రామంలో ఓ కార్యక్రమానికి హాజరైయెందుకు వెళ్తున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వాహనాన్ని కోయాచలక క్రాస్ రోడ్ వద్ద సోమవారం ఎన్నికల అధికారులు తనిఖీలు చేపట్టారు.
మంత్రితో పాటు వాహనంలో డిసిసిబి చైర్మన్ కురాకుల నాగభూషణం, ఇతర ప్రజా ప్రతినిధులు ఉండగా ఎన్నికల అధికారులు చేపట్టిన తనిఖీలకు వీరు సంపూర్ణంగా సహకరించారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున వారి వీధి నిర్వహణలో భాగంగా తనిఖీలు సర్వ సాధారణమే అని తను ఎప్పుడైన సహకరిస్తానని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు.