- మద్యం బెల్ట్ దుకాణాలపై ఉక్కు పాదం
- జిల్లాలో 756 బెల్ట్ షాపుల మూసివేత
- బెల్టు దుకాణాల నిర్వహణపై పటిష్ట నిఘా
- సీజ్ కాబడిన నగదు మద్యంపై నివేదికలు ఇవ్వాలి
- పోస్టల్ బ్యాలెట్ పై జాబితా సిద్ధం చేయాలి
- జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక అల
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
సీజ్ చేయబడిన నగదు మద్యం తదితర అంశాలపై రిటర్నింగ్ అధికారులు సమగ్ర నివేదికలు అందచేయాలని
జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. సోమవారం ఐడిఓసి కార్యాలయపు సమావేశపు హాలులో
పోలీస్ సీజర్స్ గ్రీవాన్స్ కమిటి రిటర్నింగ్ అధికారులు ఎక్సైజ్ అధికారులతో సీజర్స్ ఎన్నికల విధులు కేటాయించిన
అధికారుల సహాయక సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ జారీ బెల్టు షాపులు మూసివేత తదితర అంశాలపై సమావేశం
నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్లైయింగ్ స్క్వాడ్ టీములు పట్టుకున్న నగదుకు తక్షణమే
రశీదులు అందచేసి గ్రీవాన్స్ కమిటిని ఏ విధంగా సంప్రదించాలో అవగాహన కల్పించాలని చెప్పారు. జిల్లాలో 756
బెల్ట్ షాపులను మూసేసినట్లు చెప్పారు. బెల్టు దుకాణాలు నిర్వహణపై పటిష్ట నిఘా కొనసాగించాలని చెప్పారు.
పట్టుకున్న నగదు ఆభరణాలు మద్యం తదితర వస్తువుల యొక్క వివరాలను ఎన్నికల సీజర్ మేనేజ్మెంట్ సిస్టంలో
ఆన్లైన్ చేయాలని చెప్పారు. 80 సంవత్సరాలు పైబడిన వయోవృద్ధులకు 40 శాతం పైగా వైకల్యం కలిగిన
దివ్యాంగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి ఎన్నికల సంఘం అవకాశం కల్పించినందున క్షేత్రస్థాయిలో పరిశీలించి
జాబితాను సిద్ధం చేయాలని చెప్పారు. పట్టుబడిన నగదు ప్రచారంలో భాగంగా పొందాల్సిన అనుమతులపై అవగాహన
కల్పనకు జిల్లాలోని ఐదు నియోజకవర్గ రటర్నింగ్ అధికారులు కార్యాలయాల్లో 24 గంటలు పనిచేయు విధంగా
హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రచారానికి కావాల్సిన అనుమతులు జారీలో జాప్యం చేయొద్దని చెప్పారు.
ఏ విధంగా దరకాస్తులు చేయాలని రిటర్నింగ్ అధికారులు కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ద్వారా
అవగాహన కల్పించాలని చెప్పారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారుల సిబ్బంది ఓటుహక్కు వినియోగానికి
నవంబర్ 10వ తేదీలోగా పోస్టల్ బ్యాలెట్ కొరకు దరకాస్తు చేయాలని చెప్పారు.
ఈ సమావేశంలో ఎస్పి డాక్టర్ వినీత్.జి,
పినపాక నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ప్రతీక్ జైన్, అశ్వారావుపేట
నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి రాంబాబు, సీజర్స్ కమిటి మధుసూదన్ రాజు, యన్ వెంకటేశ్వర్లు, దుర్గాంబ,
కొత్తగూడెం, భద్రాచలం, ఇల్లందు నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు శిరీష, మంగీలాల్, కార్తీక్ తదితరులు
పాల్గొన్నారు.