మన్యం న్యూస్ గుండాల: అమరవీరుల వర్ధంతి సభలను జయప్రదం చేయాలని న్యూ డెమోక్రసీ నాయకులు గుండాల సర్పంచ్ కోరం సీతారాములు పిలుపునిచ్చారు. మండలం పరిధిలోని పోతిరెడ్డిగూడెం గ్రామంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నవంబర్ ఒకటో తారీకు నుండి అమరవీరుల వర్ధంతి సభలను గ్రామ గ్రామాన నిర్వహించాలని కోరారు. ఎందరో అమరులు తమ విలువైన ప్రాణాలను పేద ప్రజల కోసం త్యాగం చేశారని అన్నారు. అమరుల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి నరేష్, నాయకులు పరిశిక రవి, సారన్న, పెంటన్న, ఉపేందర్, లాలు, అజ్గర్ అజార్, రియాజ్, ఎల్లన్న, తదితరులు పాల్గొన్నారు
