బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపుతోనే భద్రాచలం నియోజకవర్గం సంపూర్ణ అభివృద్ధి
*ఎమ్మెల్సీ, భద్రాచలం ఎన్నికల ఇంచార్జ్ తాతా మధుసూదన్,
మన్యం న్యూస్, వాజేడు :
వాజేడు మండలం ముఖ్య కార్యకర్తల సమావేశం సోమవారం ఎమ్మెల్సీ, భద్రాచలం ఎన్నికల ఇంచార్జ్ తాతా మధుసూదన్, భద్రాచలం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తెల్లం వెంకట్రావు ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్ రావు ల ఆధ్వర్యంలో నిర్వహించారు.
వాజేడు మండలం ఎన్నికల కన్వీనర్ గా బోదే బోయిన బుచ్చయ్య కో – కన్వీనర్ గా గొడవర్తి నరసింహా మూర్తి నీ నియమిచ్చినట్లు ఎమ్మెల్సీ, ఎన్నికల ఇంచార్జ్ తాతా మధుసూదన్ ప్రకటించారు.
అనంతరం బూత్ కన్వీనర్ లకు ప్రచార కార్యక్రమాలకు సంబంధించిన విషయాలపై దిశా నిర్దేశం చేశారు. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపుతోనే భద్రాచలం నియోజకవర్గం సంపూర్ణ అభివృద్ధి చెందుతుందని భద్రాచలం ప్రజలు తమ బలమైన ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సాధ్యంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే ప్రధాన ఎజెండాగా క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు కార్యకర్తలు, బూత్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.