మన్యం న్యూస్, చర్ల:
భద్రాచలం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డా.తెల్లం వెంకట్రావు ప్రచార రథాలు చర్ల మండల కేంద్రానికి సోమ8 చేరుకున్నాయి. అనంతరం మండల అధ్యక్షులు సోయం రాజారావు ఆధ్వర్యంలో ప్రచార రథాలకు ఆంజనేయ స్వామి గుడి వద్ద పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాపుల నాగరాజు మాట్లాడుతూ నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం నియోజకవర్గం లో తెల్లం వెంకట్రావు 50 వేల ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నాడని భద్రాద్రి గడ్డపై గులాబీ జెండా ఎగడం ఖాయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి పోలిన లంక రాజు, సర్పంచ్ కాపుల కృష్ణ, ప్రచార కమిటీ అధ్యక్షులు కోటేరు శ్రీనివాస్ రెడ్డి,దొడ్డి తాతారావు,సూరిబాబు, యూత్ అధ్యక్షులు కాకి అనిల్, ఆలం ఈశ్వర్, బోళ్ళ వినోద్, పంజా రాజు తదితరులు పాల్గొన్నారు.