UPDATES  

 కాంగ్రెస్ వారంటీ లేని గ్యారెంటీ కార్డులు మనకు వద్దు- కేసిఆర్ సార్ సంక్షేమ పథకాలే ముద్దు..

 

  • కారుకు ఓటేసి అభివృద్ధికి చోటివ్వండి ఇంటింటి ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి హరిప్రియ నాయక్

మన్యం న్యూస్,ఇల్లందు:ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని 1, 2, 24 వార్డులలో బీఆర్ఎస్ పార్టీ ఇల్లందు అభ్యర్థిని బానోత్ హరిప్రియ నాయక్ సోమవారం ఉదయం నుంచే ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే హరిప్రియ మాట్లాడుతూ..కారు గుర్తుకు ఓటువేసి అభివృద్ధికి చోటు ఇవ్వాలని ఓటర్లను కోరారు. సార్వత్రిక ఎన్నికల నిమిత్తం బారాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్బుతమైన నూతన మేనిఫెస్టోను ప్రకటించి రాష్ట్రప్రజలకు హామీలవరాలను కురిపించారు అన్నారు. ఈ నాలుగున్నర ఏళ్ల కాలంలో ఇల్లందు మున్సిపాలిటీని అన్నిరంగాలలో అభివృద్ధి చేయడం జరిగిందని గతంతో పోలిస్తే ఇల్లందు మున్సిపాలిటీ అభివృద్ధి కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుందని అభివృద్ధిని చూసి పట్టం కట్టాలని ప్రజలను కోరారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిఇంటికి సంక్షేమ పథకాలను అందిస్తూ ప్రతి కార్యకర్తకు అండగా నిలిచారని తెలియజేశారు. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇల్లందు నియోజకవర్గంలో ఉన్నప్పుడు వేయబడిన ప్రధాన రహదారి సమస్యని జిల్లామంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఐటిశాఖ మంత్రివర్యులు కేటీఆర్ల దృష్టికి తీసుకువెళ్లి నేడు మన ఇల్లందు పట్టణంలోని ప్రధాన రహదారిని నిర్మించుకోవడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా ఎన్నో ఏళ్లుగా చిరకాల వాంఛగా ఉన్నా బస్ డిపోని కూడా సాధించుకోవడం జరిగిందని మీమీ వార్డులలో కూడా నెలకొన్న ఎన్నో సమస్యలను కూడా మున్సిపల్ పాలకవర్గం ద్వారా నెరవేర్చుకోగలిగామని ప్రజలకు గుర్తుచేశారు. వారంటీ లేని గ్యారెంటీ కార్డులు మనకు అవసరం లేదని ప్రతి ఇంటికి సంక్షేమాన్ని తీసుకువెళుతూ ప్రతిఇంటికి అండదండగా కేసీఆర్ ఉన్నారని మూడవసారి సైతం రాష్ట్రప్రజలు బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయాన్ని కట్టబెట్టనున్నారని ఆశాభావం వ్యక్తంచేశారు. కేసీఆర్ ఆశీస్సులతో అన్నివిధాల ఇల్లందును అభివృద్ది చేసిన తనను నియోజకవర్గ ప్రజలు మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించి పారిశ్రామికంగానూ ఇల్లందును అభివృద్ది చేసే అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తిచేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ డీవీ, జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మెన్ దిండిగల రాజేందర్, కౌన్సిలర్లు వారారవి, ఆజామ్, రజిత, నవీన్ కుమార్, పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు అబ్దుల్ నబీ, సోషల్ మీడియా ఇంచార్జి గిన్నారపు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !