మన్యం న్యూస్ మణుగూరు:
మణుగూరు మండలంలోని ఇల్లందు క్లబ్ లో జిల్లా ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు రిటర్నింగ్ అధికారి రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో పిఓ,ఏపీఓ లకు ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ,ఎన్నికల విధుల పట్ల,ఈవీఎంల పనితీరు పై వారికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది,ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.