- 20 కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీలో చేరిక
- గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలి … ప్రజలే నా కుటుంబం
- బిఆర్ఎస్ తోనే రాష్ట్రం సుభిక్షం
- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
మన్యం న్యూస్,పినపాక:
పినపాక మండలం మల్లారం గ్రామపంచాయతీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ , పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు సమక్షంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 20 కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీలో చేరారు .ఈసందర్భంగా ఆయన వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు అనంతరం పార్టీలో చేరిన వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం తోనే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని కారు గుర్తుకు ఓటు వేసి అభివృద్ధికి పట్టం కట్టాలని ఆయన అన్నారు, గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి పదేళ్లలో చేసి చూపిన ఘనత సీఎం కేసీఆర్ గారికే దక్కుతుంది అన్నారు, ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే బిఆర్ఎస్ పార్టీకి బలమని గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకెళ్లాలని ఆయన అన్నారు, రాష్ట్రంలో ప్రజలందరూ సీఎం కేసీఆర్ గారు వెంట ఉన్నారని ఈ ఎన్నికలలో బిఆర్ఎస్ దే మళ్లీ అధికారం ఎవరేం చేసిన అది ఆగేది కాదు 100 సీట్లు పైగా విజయం సాధించడం ఖాయమని ఆయన అన్నారు, పనిచేసిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని అన్నారు.