మన్యం న్యూస్,పినపాక: పినపాక నియోజకవర్గం అభివృద్ధి కొనసాగాలి అంటే మరో మారు పినపాక నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ రేగా కాంతారావు ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఎమ్మెల్యే రేగా సతీమణి రేగ సుధారాణి కోరారు. ఆమె సోమవారం పినపాక మండలంలోని మరేడుగూడెం, పినపాక గ్రామాలలో పర్యటించారు. మారేడు గూడెం గ్రామంలో మాజీ సర్పంచ్ ఎల్లయ్య అనారోగ్యంతో బాధపడుతుండగా ఆయనను పరిమర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం కల్పించారు. అనంతరం మారేడు గూడెం గ్రామంలో గడపగడపకు తిరుగుతూ రేగా కాంతారావు కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. తొలుత ఆమెకు మారేడు గూడెం గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, తో గూడెం ఎంపీటీసీ చింతపంటి సత్యం, స్థానిక నాయకులు కోరేం రామారావు, మాడేవెంగళరావు ,యువకులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
