మన్యం న్యూస్,పినపాక:ప్రతి బీ ఆర్ ఎస్ కార్యకర్త సైనికులా పని చేయాలి అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు,
విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు.
మండల పరిధి గోపాలరావు పేట గ్రామంలో సోమవారం నాడు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బొలిశెట్టి నరసింహారావు గృహంలో బీ ఆర్ ఏజ్ పార్టీ ముఖ్య నాయకులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది .ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ గెలుపునకు ప్రతి ఒక్కరు సైనికుల పని చేయాలని ఆయన కోరారు, గ్రామాలలో మ్యానిఫెస్టో కరపత్రాలను ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించి పార్టీ గెలుపు కోసం ప్రత్యేక కృషి చేయాలని వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.