మన్యం న్యూస్,అక్టోబర్30:
ఇల్లందు ఏజన్సీ పరిధిలో అతి పెద్ద జాతర అయిన శ్రీకోటమైసమ్మ తల్లి జాతర హుండి లెక్కింపును దేవదాయధర్మదాయ శాఖా ఆధికారులు సోమవారం చేపట్టారు.దేవదాయశాఖ ఇన్‌స్పెక్టర్ ఆర్.సమత,ఆలయ ఈవో వేణుగోపాలాచార్యులు, ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పర్స పట్టాభిరామారావు పర్యవేక్షణలో సింగరేణి సీఐ తిరుపతిరెడ్డి, కారేపల్లి ఎస్సై పుష్పాల రామారావు ఆధ్వర్యంలో బందోబస్తు మధ్య హుండి లెక్కింపు జరిపారు.విజయదశమి సంధర్బంగా 5 రోజుల పాటు నిరాటంకం జరిగిన జాతరకు వేలాది మంది జనం తరలి వచ్చినా ఈ సారి ఆదాయం రూ. 26.16 లక్షలు వచ్చింది. గతేడాదితో పోలిస్తే రూ.24వేల ఆదాయం తగ్గింది. దుకాణాల వేలం ద్వారా ఆదాయం పెరిగినా, హుండి ఆదాయం తగ్గింది.కానుకల ద్వారా ఆలయానికి రూ.6.96 లక్షలు వచ్చినట్లు ఆలయ ఈవో వేణుగోపాలచార్యులు,చైర్మన్ డాక్టర్ పర్సా పట్టాభిరామారావులు తెలిపారు.గతేడాది కంటే హుండి రూ.10 వేలు,దర్శనాలు,వాహన పూజకు రూ.14 వేలు ఆదాయం తగ్గినట్లు తెలిపారు. జాతరను విజయవంతంగా నిర్వహించటానికి కృషి చేసిన పోలీసుల శాఖ.జాతరలో వైద్య శిబిరం నిర్వహించిన వైద్యశాఖ, స్ధాయిన సర్పంచ్ బానోత్ బన్సీలాల్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో ఆలయ అర్చకులు కైలాస శర్మ, తోటకూరి వెంకటేశ్వర్లు,మూడు మోహన్‌చౌహన్, సర్పంచ్ బానోత్ బన్సీలాల్,ఎంపీటీసీ మూడు జ్యోతిమోహన్,ఆలయ సిబ్బంది పర్సా లలిత్ సాయి తదితరులు పాల్గొన్నారు.