- ప్రజా ఆశీర్వాద సభఫై పోలీసుల డేగ కన్ను
- సీఎం కేసీఆర్ రాక భారీ బందోబస్తు
- సభా ప్రాంగాన్ని పరిశీలించిన ఎస్పీ వినీత్
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇల్లందు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ గెలుపుకై ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు బుధవారం సీఎం కేసీఆర్ హాజరుకానున్న నేపథ్యంలో పోలీసులు డేగ కన్ను వేశారు. ఇల్లందు పట్టణం
సమస్యాత్మక ప్రాంతం కావడంతో సభ దృష్ట్యా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ వినీత్.జి స్వయంగా తన బృందంతో సీఎం కేసీఆర్ పాల్గొనే సభ ప్రదేశాన్ని భద్రత ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. అంతేకాకుండా పోలీస్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి బందోబస్తు నిర్వహించే పోలీసు అధికారులకు సూచనలు చేశారు. సమావేశంలో ఏఎస్పీలు డిఎస్పీలు సిఐలు ఎస్సైలు పాల్గొన్నారు.