మన్యం న్యూస్,అక్టోబర్31:
కారేపల్లి మండలం భాగ్యనగర్‌తండాలో 50 కుటుంబాలు బీఆర్‌ఎస్‌లో చేరారు.వైరా మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ అభ్యర్ధి బానోత్ మదన్‌లాల్ కారేపల్లి మండలంలో పర్యటించారు.ఈపర్యటనలో భాగంగా భాగ్యనగర్‌తండాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 50 కుటుంబాల వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి అహ్వనించారు.ఈసంధర్బంగా బానోత్ మదన్‌లాల్ మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పేదల ప్రభుత్వమని, పేదలను ఆదరించేది బీఆర్‌ఎస్ మాత్రమేనన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల సంక్షేమంలో ఎలాంటి లోటు లేకుండా చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పధకాలు పోయి,అవినీతి రాజ్యమేలుతుందని గత కాంగ్రెస్ పాలన చరిత్ర తెలిజేస్తుందన్నారు. పార్టీలోని ప్రతి కార్యకర్తకు ఎలాంటి అపదలేకుండా చేస్తానన్నారు. అంతకు ముందు మాధారంలో డోలమైట్ మైన్స్ ఉద్యోగి మంకెన సైదయ్య పదవీ విరమణ కార్యక్రమానికి హాజరై ఉద్యోగిని సన్మానించారు.గుంపెళ్ళగూడెం,పేరుపల్లిలో అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఉసిరికాయలపల్లిలో వివాహ ప్రథానం వేడుకలో పాల్గని వధువును ఆశీర్వదించారు.ఈకార్యక్రమాలలో జడ్పీటీసీ వాంకుడోత్ జగన్, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు పెద్దబోయిన ఉమాశంకర్,ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ బన్సీలాల్ రైతు బంధు జిల్లా సభ్యులు ఉన్నం వీరేంధర్,ప్రముఖ న్యాయవాది నర్సింగ్ శ్రీనివసరావు, సర్పంచ్‌లు ఇస్లావత్ సుజాతబన్సీలాల్,గుగులోత్ సక్రు, బీఆర్‌ఎస్ నాయకులు హన్మకొండ రమేష్, ఎస్‌కె.గౌసుద్దీన్,ఎస్‌కె.గౌసుపాషా, అడపా పుల్లారావు, జర్పుల రమేష్,వాంకుడోత్ సక్రు తదితరులు పాల్గొన్నారు.