మన్యం న్యూస్ భద్రాచలం అక్టోబర్ 31::
ఎన్నికల సభలు, సమావేశాలకు సువిధ యాప్లో దరఖాస్తు చేయాలని, సమస్యలు ఉంటే.. సీ విజిల్ యాప్లో ఫిర్యాదు చేయాలని భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ మంగళవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. దరఖాస్తు చేసిన వంద నిమిషాల్లోనే అనుమతులు మంజూరు. చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని తప్పక పాటించాలన్నారు. కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఏఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. పార్టీల నాయకులు సమన్వయం పాటించాలని ఆయన సూచించారు. భద్రాచలం పట్టణం లో అల్లర్లు చేయడం, అభ్యర్ధుల ప్రచార కార్యక్రమాలను అడ్డుకోవడం వంటివి చేయరాదు అన్నారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని నాయకులు, ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.