మన్యం న్యూస్,చండ్రుగొండ, అక్టోబర్ 31 :రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన మంగళవారం మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి….బాలికుంట గ్రామానికి చెందిన బోదా నందకుమార్(17) కూలీ పనులకు వెళ్లి మధ్యాహ్నం ద్విచక్రవాహనంపై ఇంటికి వచ్చే క్రమంలో ప్రమాదవశాత్తు క్రింద జారి పడ్డాడు.గమనించిన గ్రామస్తులు కొత్తగూడెం ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడి తండ్రి బోడా భద్రు అనారోగ్యంతో ఆరేండ్ల క్రితం చనిపోగా, తల్లి లక్ష్మి మూడేండ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోగా, తన చెల్లి బోడా లావణ్యతో కలిసి నందకుమార్ నానమ్మ ఝాంకీ దగ్గర ఉంటున్నాడు. ఈ క్రమంలో కూలీ పనులకు వెళ్లి వస్తుండగా ప్రమాదంలో నందకుమార్ మృతి చెందటంతో గ్రామంలో విషాధఛాయలు అలముకున్నాయి. మృతుడి బంధువుల పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును చేపట్టారు..
