- కదిలిన బీ ఆర్ ఏస్ ప్రచార రథం..
- పూజ చేసి ప్రారంభించిన ఎంపీపీ జడ్పిటిసి..
- డాక్టర్ తెల్లం భారీ మెజార్టీతో గెలవడం ఖాయం
మన్యం న్యూస్ దుమ్మగూడెం అక్టోబర్ 31::
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ వెంకటరావు ప్రచార రథం మంగళవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం దగ్గర ఎమ్మెల్యే అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ ఎంపీపీ రేసు లక్ష్మి ,జడ్పిటిసి తెల్లం సీతమ్మ పూజా కార్యక్రమం నిర్వహించి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు అన్నే సత్యనారాయణమూర్తి పాల్గొని మాట్లాడుతూ.. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే ఈసారి భద్రాచలంలో పార్టీ విజయానికి దోహదపడతాయని భద్రాచలం అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరూ కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి కనితి రాముడు నడికుడి ఎంపిటిసి తిరుపతిరావు ప్రచార కమిటీ అధ్యక్షులు దామ్మెట్ల శ్రీనివాసరావు యూత్ కమిటీ అధ్యక్షులు అల్లాడి వెంకటేష్ గంగరాజు పార్టీ సీనియర్ నాయకులు సీతారామారావు భూపతిరావు రాము గంగరాజు తదితరులు పాల్గొన్నారు.