మన్యం న్యూస్ అన్నపురెడ్డిపల్లి అక్టోబర్ 31: అన్నపురెడ్డిపల్లి మండల కేంద్ర పరిధిలోని ఎస్సీ కాలనీలోని గల డబుల్ బెడ్రూం కాలనీలో మంగళవారం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బోయినపల్లి సుధాకర్ రావు ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పర్యటించారు.అనంతరం ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా ఆప్యాయంగా పలకరిస్తూ బీఆర్ఎస్ సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు మాట్లాడుతూ అశ్వరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా మళ్లీ గెలిచేది మెచ్చనే అని ధీమ వ్యక్తం చేశారు.అనంతరం మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలోని యూత్ తో ముచ్చటిస్తూ,బిఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ,సంక్షేమ పథకాలే మళ్లీ ముచ్చటగా మూడోసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వా ఏర్పాటుకు పట్టం కడతాయని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో జంగాల ఉమామహేశ్వరరావు,చల్లా రాంబాబు,పెదగాండ్ల పుల్లారావు,జీవ్వజి వీరభద్రం, కుర్సం బాలకృష్ణ,కూర్సం శివ,నాగేంద్రం,శివ,వడ్డేపల్లి వెంకటేశ్వర్లు,గాదెసత్యం,మడి సందీప్,రేగులగడ్డ రాంబాబు,పింగిలి శ్రీను, షేక్ సైదులు, షేక్ బాషా,పెంకే చంటి,బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు
