మన్యం న్యూస్ వాజేడు
మండలంలో పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కృష్ణాపురం గ్రామ శివారులో జాతీయ రహదారిపై ఎస్సై రమేష్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. గుమ్మడిదొడ్డి గ్రామం వాజేడు మండలంకు చెందిన గుమ్మడి విశ్వనాథం అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై చత్తీస్గడ్ రాష్ట్రం నుండి గుమ్మడిదొడ్డి గ్రామముకు 140 లీటర్ల నిషేధిత గుడుంబాను తరలిస్తుండగా మార్గమధ్యంలో పోలీసులు పట్టుకున్నారు. సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఈ కార్యక్రమంలో 39 -G సిఆర్పిఎఫ్ బెటాలియన్ సివిల్ కానిస్టేబుల్స్ తదితరులు పాల్గొన్నారు.