మన్యం న్యూస్,చండ్రుగొండ, అక్టోబర్ 31: మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 39వ ఇందిరా గాంధీ వర్ధంతి ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దారం గోవింద రెడ్డి,జిల్లా నాయకులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి, మాలోత్ భోజ్య నాయక్, నల్లమోతు రమణ, తుమ్మలపల్లి సురేష్, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు కేశబోయిన నరసింహారావు, అంతటి రామకృష్ణ, బడుగు కృష్ణవేణి, బొర్రా సురేష్, మనోహర్, కార్యకర్తలు పాల్గొన్నారు.
