- టాప్ గేర్ లో కారు,చేరికల జోరు
- అభివృద్ధి,సంక్షేమానికే పట్టం కడుతున్న ప్రజలు
- కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 250 కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీలో చేరిక
- గులాబీ కండువా కప్పి ఆహ్వానించిన ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
మన్యం న్యూస్ మణుగూరు:
మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని గోల్డ్ షాప్ లైన్ రామాలయం ఏరియా,ఆదర్శ్ నగర్ కు కాంగ్రెస్ పార్టీ చెందిన సుమారు 250 కుటుంబాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే రేగా కాంతారావు వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం పార్టీలో చేరిన వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సంక్షేమంలో స్వర్ణ యుగాన్ని తలపించేలా పథకాలను అమలు చేయడం జరిగిందన్నారు.అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా సంక్షేమ పథకాలను అమలు చేశామన్నారు.రైతులకు రైతుబంధు,రైతు బీమా,24 గంటల ఉచిత కరెంటు ఇవ్వడం జరిగిందన్నారు. మహిళలకు కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్,ఆరోగ్యలక్ష్మి,కెసిఆర్ కిట్టు,న్యూట్రిషన్ కిట్టు వంటి అద్భుతమైన పథకాలను అమలు చేస్తున్నామన్నారు. దళిత బంధు,బీసీ బందు వంటి విప్లవాత్మకమైన పథకాలను ప్రవేశపెట్టి,పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా బిఆర్ఎస్ ప్రభుత్వం పని చేసిందన్నారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో తో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు.కెసిఆర్ బీమా ద్వారా ప్రతి ఇంటికి బీమా కల్పించే అద్భుతమైన పథకాన్ని అమలు చేస్తామన్నారు. సౌభాగ్య లక్ష్మి ద్వారా మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తామని, వృద్ధులకు పెన్షన్ 3వేల నుంచి 5వేలకు పెంచుతామన్నారు. వికలాంగులకు 4వేల నుండి 6వేల రూపాయలకు పెంచడం జరుగుతుంది అన్నారు. రైతుబంధు 10వేల నుండి 16 వేలకు విడతల వారీగా పెంచుతామని వారు తెలిపారు. అన్నపూర్ణ పథకం ద్వారా పేద ప్రజలందరికీ సన్న బియ్యం అందిస్తామని అన్నారు.ఆరోగ్య రక్ష పథకం ద్వారా పేద ప్రజల కు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన వెంటనే ఈ పథకాల అమలకు శ్రీకారం చుడతామన్నారు.అభివృద్ధి, సంక్షేమ ప్రభుత్వానికి అండగా నిలవాలని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కోరారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులు,పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి నవీన్ పార్టీ సీనియర్ నాయకులు యూసఫ్,పార్టీ ముఖ్య నాయకులు,యువజన నాయకులు,బిఆర్ఎస్వి నాయకులు,సోషల్ మీడియా సభ్యులు,మహిళా కార్యకర్తలు, మహిళలు,యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు.