మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు అసెంబ్లీ సెగ్మెంట్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ విజయాన్ని కాంక్షిస్తూ ఏర్పాటు చేస్తున్న ప్రజా ఆశీర్వాద సభకు బుధవారం సీఎం కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లను మంగళవారం పలువురు ప్రజాప్రతినిధులు పరిశీలించడం జరిగింది. అనంతరం మంత్రి సత్యవతి రాథోడ్ జన్మదిన వేడుకలను వేదిక వద్దనే నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి చేత ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, మాలోతు కవిత, ఎమ్మెల్యే బానోతు హరిప్రియ హరిసింగ్ నాయక్, మహబూబాబాద్ జెడ్పీ ఛైర్ పర్సన్ అంగోతు బిందులతో కలిసి కేక్ కట్ చేయించారు. శుభాకాంక్షలు తెలిపారు. సభాస్థలి వద్ద ఏర్పాట్లలో నిమగ్నమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ దిండిగల రాజేందర్, ఇల్లందు మునిసిపల్ ఛైర్మన్ ధమ్మాలపాటి వెంకటేశ్వరరావు, వైఎస్ ఛైర్మన్ జానీపాషా, బీఆర్ఎస్ నాయకులు మర్రి రంగారావు, మూల మధుకర్ రెడ్డి, పలువురు కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, గులాబీ శ్రేణులు చప్పట్లు కొడుతూ మంత్రి సత్యవతికి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు.