మన్యం న్యూస్,భూర్గంపాడు:
పినపాక శాసన సభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు మండలం పరిధి ఉప్పు సాక పంచాయతీలో గల ( 220) బూత్ లో బీఆర్ఎస్ పార్టీ పినపాక నియోజకవర్గ అభ్యర్థి రేగా కాంతారావు గెలుపు కొరకు ఆ పార్టీ శ్రేణులు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఉప్పుసక* పంచాయతీ లో ప్రతి ఇంటిని కి తిరుగుతూ సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన మ్యానిఫెస్టోని వివరించి వాల్ పోస్టర్స్ ఇంటి ఇంటికి డోర్ స్టిక్కర్లు అంటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు,వార్డ్ మెంబర్స్, యూత్ నాయకులు , సంఘాల నాయకులు, గ్రామ పెద్దలు, పార్టీ నాయకులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.