మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బుధవారం ఎన్నికల బరిలో ఉండే అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేయడం జరిగింది. ఐదు నియోజకవర్గాలలో మొత్తం 95 మంది పోటీలో ఉన్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో 30 మంది, పినపాక నియోజకవర్గంలో 18 మంది, భద్రాచలం నియోజకవర్గంలో 13 మంది, ఇల్లందు నియోజకవర్గంలో 20 మంది, అశ్వరావుపేట నియోజకవర్గంలో 14 మంది అసెంబ్లీ ఎన్నికల పోటీలో ఉన్నట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించడం జరిగింది.