- విజయోస్తు..
- వన దేవతలు సమ్మక్క ,సారక్కల ఆశీర్వాదం తీసుకున్న పినపాక బీఆర్ ఎస్ అభ్యర్థి రేగా కాంతారావు
- దుగునేపల్లి లో ప్రచారం ప్రారంభించిన రేగా
- కారు గుర్తు కు ఓటెయ్యండి…అభివృద్ధిని ముందుకు తీసుక వెళ్ళండి
- ఓటర్లను అభ్యర్థించిన పినపాక నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి రేగా కాంతారావు
మన్యం న్యూస్,పినపాక: పినపాక నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి రేగా కాంతారావు బుధవారం తన గెలుపును కాంక్షిస్తూ ప్రచారం ప్రారంభించారు.మండల పరిధి దుగునేపల్లి పంచాయతీ రెడ్డి గూడెం లో కొలువై ఉన్న వన దేవతలు శ్రీ సమ్మక్క సారలక్కలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆశీర్వాదం తీసుకో ప్రచారానికి బయలుదేరారు. తొలుత రేగా కాంతారావుకు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి, ఎంపీపీ గుమ్మడి గాంధీ, జడ్పిటిసి దాట్ల సుభద్రా దేవి వాసు బాబు, ఆత్మా కమిటీ చైర్మన్ పొనుగోటి భద్రయ్య, బీఆర్ఎస్ జిల్లా నాయకులు కోలేటి భవాని శంకర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దాట్ల వాసు బాబు లు ఘన స్వాగతం పలికారు. అనంతరం దుగినపల్లి, అడవి రామవరం,చేగర్శల, మల్లారం,పోట్లపల్లి, కొత్తూరు, కిష్టాపురం, సామర్లకోట, పాండురంగాపురం తదితర గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఇప్పటివరకు అందించిన సంక్షేమ పథకాల తో పాటు, బీఆర్ఎస్ మేనిఫెస్టో, తన హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్ డాక్టర్ వర్మ సర్పంచ్ మొగిలిపల్లి నరసింహారావు ఎంపీటీసీ కాయం శేఖర్, కో ఆప్షన్ సభ్యులు ఎస్కే జహంగీర్ ,మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాంబశివరావు ,బీఆర్ఎస్ నాయకులు సత్తిబాబు, కిషోర్, ఎగ్గడి సత్యనారాయణ,చెన్నకేశవు లు,తోలెం శ్రీను తదితరులు పాల్గొన్నారు.