మన్యం న్యూస్ దుమ్ముగూడెం నవంబర్ 15::
భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలోని మౌలిక సదుపాయాలకు, నియోజవర్గ అభివృద్ధి కోసమే బీఆర్ఎస్ పార్టీలో చేరానని, పోడు సాగుదారులకు పట్టాలు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రావులపల్లి రాంప్రసాద్ అన్నారు. బుధవారం మండలంలోని లక్ష్మీనగరం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశానికి పార్టీలో చేరిన తర్వాత మొదటిసారి వచ్చిన సందర్భంగా మండల అధ్యక్షులు అన్నే సత్యనారాయణ మూర్తి, సీనియర్ నాయకులు సాగి శ్రీనివాసరాజు ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాంప్రసాద్ మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న కోడు సాగుదారులకు పట్టాలి ఇచ్చి రైతుబంధును అందించిన ఘనుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని భద్రాచలం నియోజవర్గం అభివృద్ధి ఆయన తోనే సాధ్యమవుతుందని బిఆర్ఎస్ పార్టీలో చేరానని తెలిపారు. భద్రాద్రి అభివృద్ధి కొరకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు గెలుపు కోసం కార్యకర్తలు నాయకులు ప్రజాప్రతినిధులు అంతా సమిష్టిగా పనిచేయాలని ఈ దుమ్ముగూడెం మండలం నుంచే అత్యధిక మెజారిటీ రావాలని కోరారు. ఈ నెల 19వ తేదీన భద్రాచలంలో జరగనున్న కేటీఆర్ రోడ్ షోకు అందరూ తప్పకుండా హాజరుకావాలని మండల అధ్యక్షులు కార్యకర్తలకు బూత్ కమిటీ సభ్యులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శి కనితి రాముడు, అధికార ప్రతినిధి ఎండి జానీ పాషా, ఉపాధ్యక్షులు తునికి కామేష్, దిశా కమిటీ సభ్యులు సర్పంచ్ మట్ట శివాజీ, నాయకులు సీతారామారావు, జోగా వెంకటరమణ, లక్ష్మణ్,, మోతుకూరి శ్రీకాంత్, సర్పంచ్ సీతారాం, ఉబ్బ వేణు, అల్లాడి వెంకటేష్, జిలకర గంగరాజు, కనితి సమ్మయ్య, జయసింహ బొల్లి శేఖర్, తదితరులు పాల్గొన్నారు.