- అభివృద్ధి ప్రదాత రేగా కాంతారావుకు అడుగడుగున జననిరాజనం
- అన్న మళ్లీ మీరే రావాలి
- విజయ తిలకం దిద్ది ఆశీర్వదించిన సోదరీమణులు
మన్యం న్యూస్,పినపాక: బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు, పినపాక నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రేగా కాంతారావు మండలంలోని పలు గ్రామాలలో తన గెలుపును కోరుతూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అడవిరామారం, దుగినేపల్లి, జానంపేట,చేఘర్షల, పాండురంగాపురం, మల్లారం జగ్గారం తదితర గ్రామాలలో నిర్వహించిన ప్రచారంలో ప్రజలు మహిళలు యువత పార్టీ శ్రేణులు స్వచ్ఛందంగా పాల్గొని దండువలే కదిలారు. మా కష్టాలు తీర్చిన పెద్దన్నవు… మళ్లీ నీవే గెలవాలి అంటూ సోదరీమణులు రేగా కాంతారావుకు విజయ తిలకం దిద్ది మంగళహారతులతో ఆశీర్వదించారు. పూలు వెదజల్లుతూ వారు రేగాపై అభిమానం చాటుకున్నారు. మళ్లీ మీరే రావాలి అభివృద్ధి కొనసాగాలి అని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రేగా కాంతారావు ప్రజలను, చిరు వ్యాపారులను తమ అమూల్యమైన ఓటు కారు గుర్తుపై వేసి భారీ మెజార్టీ తో తనను గెలిపించాలని ఓటర్ మహాశయులను కోరారు. ఈ కార్యక్రమంలో పినపాక మండల బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, శ్రేణులు, ముఖ్య కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.